* సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ట్విట్టర్ లో సెటైర్లు
సారథి, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై రోజుకో రకంగా సెటైర్లు విసురుతూ వార్తల్లోకి ఎక్కుతొంది. సీఎం కేసీఆర్ ఆరోగ్యశాఖ మంత్రి పదవి బాధ్యతలు చేపట్టాకా తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరతలుండవని ఘాటుగా విమర్శించారు. కొత్త వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కేసీఆర్ అంటూ ఓ వైపు శుభాకాంక్షలు చెప్పుతునే, మరోవైపు జ్వరం వస్తే వేసుకునే పారాసిటమల్ ట్యాబ్లెట్లతో కరోనా తగ్గిపోతొందని ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసురుతొంది. దొరగారు ఇక మంత్రి అయితే కొత్త సర్కార్ దవాఖానాల్లో సౌలతులు, నర్సులు, డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయడమే కాకుండా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చితే ప్రభుత్వాస్పత్రుకి జనం క్యూ కడతారని వ్యంగ్యాస్ర్తాలు చేసింది. కరోనాతో కొట్లాడుతున్న కరోనా వీరుడని, ఎవరైనా కరోనా మహమ్మారిపై మాట్లాడితే వారికి కరోనా అంటుకోనంటూ శాపనార్థాలు పెడతాడంది.