- టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫైర్
సామాజిక సారథి, హన్మకొండ: టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలకంటే, ఆదాయమే ముఖ్యమైపోయిందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసినవిలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలను రాత్రి 12 గంటల వరకూ అనుమతించడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల పని తీరు దారుణంగా ఉందన్నారు. కరోనా మూడోవేవ్ తీవ్రరూపం దాల్చే అవకాశముందని, డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోందని, రాష్ట్రంలో న్యూ ఇయర్ సందర్భంగా బార్లకు మాత్రం ఆంక్షలు ఉండవని విమర్శించారు. తాగండి…ఊగండి అనేలా కేసీఆర్ వ్యవహార శైలి ఉందంటూ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, వర్దన్నపేట నియోజకవర్గం కో ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఈవీ శ్రీనివాస్ రావు, దొమ్మాటి సాంబయ్య, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ చైర్మన్ బంక సరళ, దబ్బేట రమేష్, షేక్ మొఇనుద్దిన్, బంక సంపత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.