- త్వరలోనే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి
- ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఇంటిని ఇంటర్నెట్తో అనుసంధానం చేసేందుకు అవసరమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేయనున్నట్లు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టుతో భవిష్యత్‌లో 5జీ టెక్నాలజీ వంటి సేవలు మారుమూల ప్రాంతాలకు అందుతాయని వివరించారు. శుక్రవారం ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ నిర్వహించిన చార్జి గోస్ట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవల కోసం ఆరేళ్లుగా ప్రభుత్వం ఎమర్జింగ్ టెక్నాలజీని వాడుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం, హెల్త్ కేర్ ఎడిషన్ వంటి రంగంలో ఇన్విటేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మమైన మార్పులు వస్తాయని వివరించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం, హెల్త్ కార్ రంగంలో మెడిసన్ ఫ్రమ్ ది సో వంటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్తదితరులు పాల్గొన్నారు.