సారథి, బిజినేపల్లి: సమాచార హక్కు చట్టం కింద సకాలంలో దరఖాస్తుదారుడికి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్‌కు ఆర్టీఐ కమిషనర్ బుధవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామంలో 2012లో ఎంత మంది రైతులు ఖరీఫ్ సీజన్లో బీమా చెల్లించారో తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని న్యాయవాది ఏసీబీ శ్రీరామ్ఆర్యా బిజినేపల్లి తహసీల్దార్‌కు దరఖాస్తు చేశారు. సమాచారం ఇవ్వకపోవడంతో నాగర్‌కర్నూల్ ఆర్డీవోకు అప్పీల్చేశారు. అయినా కూడా జిల్లా అధికారుల నుంచి సరైన సమాచారం, సమాధానం రాకపోవడంతో నేరుగా ఆయన రాష్ట్ర సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఈ విషయమై తాజాగా బిజినేపల్లి తహసీల్దార్‌కు నోటీసులు ఇచ్చారు. ఎందుకు జరిమానా విధించకూడదో సమాధానం చెప్పాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. దరఖాస్తుదారుడు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
- April 29, 2021
- Archive
- BIJINEPALLY
- NAGARKURNOOL
- RTI ACT
- ఆర్టీఐ చట్టం
- నాగర్‌కర్నూల్
- బిజినేపల్లి
- సమాచార కమిషనర్
- Comments Off on తహసీల్దార్‌కు సమాచార కమిషనర్ నోటీసులు