సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఇందిరమ్మ సేవలు… భారతదేశ ప్రజలకు మరపురాని జ్ఞాపకాలు అని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు పల్లె రాజు అన్నారు. 38వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గరీబి హఠావో నినాదంతో దళిత, గిరిజన, బహుజన వర్గాలకు లబ్ది చేకూర్చేలా ముందుకెళ్లిన ఘనత ఇందిరమ్మకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్యామ్ గౌడ్, సీనియర్ నాయకులు సుధాకర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి దినేష్, అసెంబ్లీ కార్యదర్శి వెంకట్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,లక్ష్మణ్, శ్రావణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- November 1, 2022
- Archive
- లోకల్ న్యూస్
- 38 Varthanti
- Indira Gandhi
- ramakrishnapur
- services
- Comments Off on ఇందిరమ్మ సేవలు… మరపురాని జ్ఞాపకాలు