… హత్యా ప్రయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
… కలెక్టర్ , ఎస్పీ గ్రామాన్ని వెంటనే సందర్శించాలి
… మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ రామచందర్
సామాజిక సారధి , నాగర్ కర్నూల్: … గిరిజన నాయకుడైన వాల్య నాయక్ పై అగ్రకులానికి చెందిన నలుగురు విచక్షరహితంగా బహిరంగంగా దాడి చేసి , హత్య ప్రయత్నం చేయడానికి కుట్ర చేసిన నలుగురు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిజ ని రిద్దారణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామాన్ని సందర్శించి నలుగురు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ రామచందర్ డిమాండ్ చేశారు . వాల్య నాయక్ కుటుంబాన్ని పరామర్శించి దాడి జరిగిన వివరాలను తెలుసుకున్నారు . నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గిరిజన నాయకుడు పై బహిరంగంగా ముగ్గురు రెడ్లు , ఓ బి సి నాయకులు కలిసి కింద పడేసి గొంతు పై కాలు పెట్టి చెప్పుతో తొక్కుతున్న ఫోటో దృశ్యాలను పలు పత్రికలు ప్రచురించిన బాధితుడు ఆధారాలతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన అగ్రకుల నాయకులపై నేటికీ హత్యయత్నం కేసు నమోదు చేయకపోవడం ఏమిటని వారు పత్రికల ద్వారా ప్రశ్నిస్తున్నారు .
కేవలం అట్రాసిటీ కేసును చేసి చేతులు దులుపుకున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని గిరిజన నాయకుని పై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చర్యలు చేపట్టక ముందుకే పోలీసులు నిందితులను వెంటనే అరెస్టు చేసి అత్యాయత్నం కేసు నమోదు చేయాలని , గ్రామాన్ని అట్రాసిటీ విలేజ్ గా ప్రకటించాలని జీవో నెంబర్ 105 , 128 ,129 ప్రకారం అతనిపై దాడి చేసిన వాళ్ళను చట్టపరంగా శిక్షించాలని కమిటీ డిమాండ్ చేసింది . అగ్రకుల నాయకులైన చిన్నారెడ్డి , కృష్ణారెడ్డి , తిరుపతి రెడ్డి , స్వామి లు గిరిజని దాడి చేసి మళ్లీ వారే గిరిజన కుటుంబాలపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని గిరిజనులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేటికీ విచారణ చేసిన పోలీసు అధికారులు వారు గ్రామాలలోని ఎదేచ్ఛగా తిరుగుతున్న ఎందుకు అరెస్టు చేయడం లేదని జిల్లా ఎస్పీకి సూటి ప్రశ్న అడుగుతున్నట్లు వారు తెలిపారు . దాడి జరిగిన సంఘటన గ్రామాన్ని జిల్లా కలెక్టర్ , ఎస్పీ , ఎస్సీ కమిషన్ వెంటనే సందర్శించి వారి కుటుంబానికి రక్షణ కల్పించాలని , నిందితులను వెంటనే అరెస్టు చేయని పక్షంలో వారం రోజుల్లో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చర్య చేపడతామని హెచ్చరించారు . అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు మొ ల్గర మహేందర్ , జగ్జీవన్ రావ్ కమిటీ జిల్లా నాయకులు కొత్తపల్లి వెంకటయ్య , కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న , తెలంగాణ దళిత సమైక్య జిల్లా అధ్యక్షులు ఎదిరేపల్లి కాశన్న ఉన్నారు
Hi