Breaking News

వాళ్లు పులిబిడ్డలైతే ఎందుకు మాట్లాడించలేదు..?

వాళ్లు పులిబిడ్డలైతే ఎందుకు మాట్లాడించలేదు..?
  • అమ్ముడుపోయే దొంగలే ధర్మం అంటున్నరు
  • కేసీఆర్ అబద్ధపు హామీలు నమ్మకండి
  • 8ఏండ్లలో చేయని పనులు 15రోజుల్లో చేస్తారా?
  • బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సామాజిక సారథి, మునుగోడు: సీఎం కేసీఆర్ పై బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. బ్రోకర్లను అమ్ముడుపోకుండా నిలబడ్డ నికార్సయిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ అనే బోను నుంచి ఎప్పుడు వదులుతారు? అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. వాళ్లు నిజంగా పులిబిడ్డలలైతే ఆదివారం చండూర్ సభలో వారితో ఎందుకు మాట్లాడించలేదని నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా సోమవారం చందురు కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికంగా ఉన్నవీర బ్రహ్మేంద్రస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. కొనుగోలు కేసుల్లో నిందితులు మళ్లీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని గుర్తు చేశారు. పులి బిడ్డలకు దృశ్యం 3 సినిమా చూపించడం ఇంకా పూర్తయినట్లు లేదని ఆర్ఎస్పీ సైట్లు వేశారు. బీసీలకు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చేసిన మోసాలు అంటూ ఓ వీడియో షేర్ చేశారు. “తరతరాలుగా నిస్సహాయ స్థితిలో దోపిడి దొరల పార్టీలో బందీ అయిన మా బహుజన బీసీ బిడ్డలకు ఇంత చక్కటి వీడియో చేసిన ఊరుముల్ల విశ్వం గారికి అభినందనలు’ అని అన్నారు. ఆత్మగౌరవ భవనాలు కాదు. ఊరు మధ్య ఉన్న ప్రగతిభవన్ కావాలి అని సూచించారు.

అమ్ముడుపోయే దొంగలే ధర్మం అంటున్నారు

అమ్ముడుపోయే దొంగలందరూ ఒక్కటై ధర్మం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆర్సీ విమర్శించారు. దమ్ముంటే కేసిఆర్ నలుగురు ఎమ్మె ల్యేలతో ఎందుకు మాట్లాడించలేదని ప్రశ్నించారు. ఎనిమిది ఏళ్ల పాలనలో చేయని పనులు పదిహేను రోజుల్లో చేస్తామని అబద్దపు హామీలతో మళ్లీ ప్రజలను మబ్యపెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రత భావంతో ఉన్నారని తెలిపారు. అన్ని పార్టీలలోని ఎమ్మెల్యేలు కూడా ఏనుగు గుర్తుకు ఓటు వేస్తారని పేర్కొన్నారు. 22 వేల కోట్లు వందల ఎకరాల భూమిని రాజ్యాంగ బద్దంగా గుంజుకొని పేదలకు పంచడానికి బీఎస్పీ వచ్చిందని గుర్తు చేశారు. ఈ దోపిడీ దొంగలకు కొనుగోలు చేయడం తప్ప. ప్రజల సమస్యలు తెలియదన్నారు. బీజేపీ పార్టీ హిందూత్వ పేరుతో హిందువులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అంతకు ముందు బోడంగిపర్తి గ్రామంలోని మంచికంటి గోపమ్మ మెమోరియల్ పాఠశాల సందర్శించి విద్యార్డులను కలిశారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ ప్రచారంలో అభ్యర్థి ఆందోజు శంకరాచారి, రాష్ట్ర నాయకులు మహతి రమేష్, ప్రమీల, ధర్మేందర్ జిల్లా నాయకులు జగన్నారం గౌడ్, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.