సారథి న్యూస్, హైదరాబాద్: గుస్సాడి కళాకారుడు కనకరాజు తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఈ రాష్ట్రానికే గర్వకారణమని గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ అన్నారు. తనకు గిరిజనులు అంటే చాలా అభిమానమని అన్నారు. తాను గవర్నర్ కాక ముందు నుంచే గిరిజనులతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నానని వెల్లడించారు. గిరిజనుల వైద్యానికి ప్రత్యేకత ఉందన్నారు. గిరిజనులు ఆచార వ్యహారాల వల్ల వారి వయసుకు తగినట్లుగా కాకుండా ఇంకా యవ్వనంగా ఉంటారని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడి నృత్యగురువు కనకరాజును సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్తమిళసై సౌందర్‌రాజన్ మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల్లో రైతులు జరుపుకునే సంక్రాంతి పండుగల మాదిరిగానే గిరిజనుల జరుపుకునే ఆచారాలు కూడా వ్యవసాయానికి సంబంధమైనవిగా ఉంటాయని వివరించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లా బోడేగూడెం వెళ్లిన స్థానిక గిరిజనులతో కలవడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. గుస్సాడి నృత్యానికి వన్నెతెచ్చిన నృత్యగురువు కనకరాజుకు పురస్కారం రావడం అభినందనీయమన్నారు. కనకరాజు 1981లో రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఎర్రకోట వద్ద గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, వివిధ శాఖల కార్యదర్శులు, గిరిజనులు పాల్గొన్నారు.
- February 1, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- షార్ట్ న్యూస్
- GOVERNoR TAMILISai
- GUSSADI
- KANAKARAJU
- PADMASRI
- గవర్నర్సౌందర్రాజన్
- గుస్సాడి
- పద్మశ్రీ పురస్కారం
- Comments Off on గిరిజనులంటే నాకు ఎంతో అభిమానం