సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. టీఆర్ఎస్ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. 8, 9, 10వ రౌండ్లు వీణవంక, 10, 11, 12,13,14,15 రౌండ్లు జమ్మికుంట, 16వ రౌండ్లో జమ్మికుంటతో పాటు ఇల్లందుల, 17,18వ రౌండ్లు ఇల్లందుల, కమలాపూర్, 19, 20, 21,22వ రౌండ్లలో కమలాపూర్ ఓట్లను ఎన్నిక కౌంటింగ్ అధికారులు లెక్కించనున్నారు. ఇప్పటికే 7 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆధిక్యం కొనసాగిస్తున్నారు. 7 రౌండ్లో బీజేపీ 4044 (31,027), టీఆర్ఎస్ 3792 (27,589) ఓటు సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 3438 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
- November 2, 2021
- Archive
- Top News
- counting
- ETA
- gellu srinivas
- TRS
- ఈటల
- టీఆర్ఎస్
- హుజూరాబాద్
- Comments Off on రౌండ్.. రౌండ్.. టెన్షన్.. టెన్సన్