సామాజిక సారధి , బిజినేపల్లి : రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించిన జడ్పిటిసి హరిచరణ్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు . బిజినపల్లి నుండి వనపర్తి రోడ్డు వెళుతున్న జడ్పిటిసి హరిచరణ్ రెడ్డి వనపర్తి రోడ్డులో ఉన్న కిరణ్ రైస్ మిల్లు ముందు ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కింద పడి స్పృహ తప్పి పోతుంటే వెంటనే గుర్తించి ఆయన వాహనాన్ని నిలిపి గాయాలతో ఉన్న బాధితులను లేపి వారి వాహనంలో ఆసుపత్రికి తరలించారు . గాయలతో ఉన్న వ్యక్తి వివరాలు తెలుసుకొని వారి గ్రామానికి సమాచారం ఇచ్చారు .
- January 9, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- NAGARKURNOOL
- ZPTC
- Comments Off on మానవత్వం చాటుకున్న జడ్పిటిసి