సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా వట్టెం నవోదయ విద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయుడు శేషం సుప్రసన్నాచార్యులుకు కర్ణాటకలోని విజయనగరం విరూపాక్ష స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం జరిగిన ప్రతిష్ఠాత్మక జాతీయ సంగీత నృత్య సాహిత్య కార్యక్రమంలో సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కోలా వేంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. సుప్రసన్నాచార్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు సాహిత్యంలో విశేషకృషి చేశారని, పద్యకవిత వచనకవితా ప్రక్రియల్లో కవితారచన చేయడంలో సవ్యసాచి అని కొనియాడారు. కర్ణాటక మాజీమంత్రి ఆనంద్ సింగ్, బళ్లారి ఎంపీ వై.దేవేంద్రప్ప, శ్రీకృష్ణదేవరాయల వారసులు ఆనెగొంది సంస్థానాధీశుడు రాజా శ్రీకృష్ణదేవరాయ, ప్రఖ్యాత కూచిపూడి నాట్యశాస్త్ర ప్రావీణ్యుడు డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్, తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నాట్యశాస్త్ర విభాగం మాజీ అధిపతి డాక్టర్ దేవరపిళ్లై హోస్ పాల్గొన్నారు.
- January 24, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- CITIZEN WLFARE
- NAVODAYA
- SRIKRISHNADEVARAYULU
- VEERUPAKSHI TEMPLE
- నవోదయ
- విరూపాక్ష స్వామి ఆలయం
- శ్రీకృష్ణదేవరాయలు
- సిటిజన్ వెల్ఫేర్
- Comments Off on నవోదయ ఉపాధ్యాయుడికి గౌరవ పురస్కారం