Breaking News

అధిక ఫీజులు అరికట్టాలి : కేవీపీఎస్​

అధిక ఫీజులు అరికట్టాలి : కేవీపీఎస్

సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి:  ప్రయివేట్​ పాఠశాలల్లో  అధిక ఫీజులను అరికట్టాలని కేవీపీఎస్​జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రిజమ్ పాఠశాలతో పాటు అన్ని ప్రయివేట్​ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేదలను నడ్డివిరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా యజమానులతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.  పాఠ్యపుస్తకాలు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఎక్కువ రేటు అమ్ముతున్నారని ఆయన విమర్శించారు. ప్రయివేట్​ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో మొత్తం విద్యావ్యవస్థను నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నదని  ఆయన అన్నారు. మరో వైపు ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ప్రయివేట్​ పాఠశాలలో 20శాతం సీటు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్​ నాయకులు రాములు, కృష్ణ, చంద్రయ్య, భీముడు, చిన్నయ్య పాల్గొన్నారు.