Breaking News

ప్రేమన్నాడు.. పెళ్లంటే పారిపోయాడు!

  • అత్యాచార నిందితుడు బురానుద్దీన్ పరారీ
  • బాధితురాలు ఫిర్యాదు మేరకు 7 మందిపై
    కేసు నమోదుచేసిన పోలీసులు
  • ఐదుగురు నిందితుల రిమాండ్
    సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: పెళ్లి పేరుతో మహిళను మోసం చేసి అత్యాచారం చేసిన బురానుద్దీన్ , అతని కుటుంబసభ్యులపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నాగర్ కర్నూల్ సీఐ హనుమంతు యాదవ్ కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోల్ గ్రామానికి చెందిన రిజ్వానా బేగం అనే జూనియర్ లెక్చరర్ ను మూడు సంవత్సరాల నుండి ప్రేమ పేరుతో ప్రేమించి నిశ్చితార్థం చేసుకొని బాధితురాలిని బురానుద్దీన్ పాలెం గ్రామంలోని వారి ఇంటికి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడని , అత్యాచారం చేసేందుకు బు రానుద్దీన్ కుటుంబ సభ్యులు సహకరించారని , అంతేకాకుండా బాధితురాలు నుండి రూ.12 లక్షలను వివిధ రూపాల్లో తీసుకున్నారని పెళ్లి చేసుకోవాలని అడగడంతో పెళ్లికి నిరాకరించాడు. 10 రోజుల నుండి బాధితురాలు బురానుద్దీన్ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేసినా కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఆమెకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయడంతో విచారణ చేశామని అందులో భాగంగానే బాధితురాలు ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు బురానుద్దీన్ , వారి చెల్లెలు జుబేదాబేగం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో ఉన్న మరో ఐదుగురిలో ఖతిజా , జమీల , ఫరీదా , నసీమా , జాంగిర్ పాషాను అదుపులోకి తీసుకుని మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. పరారీలో ఉన్న ఇద్దరిని కూడా పట్టుకొని చర్యలు తీసుకుంటామని సీఐ హనుమంతు యాదవ్ తెలిపారు.