Breaking News

ఎస్సీ గురుకుల ‘ఎంట్రెన్స్‌’ ఫలితాలు విడుదల

ఎస్సీ గురుకుల ‘ఎంట్రెన్స్‌’ ఫలితాలు విడుదల

సామాజికసారథి, హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో చేరేందుకు నిర్వహించిన ఎంట్రెన్స్‌(ఆర్‌జేసీ సెట్‌-2022) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 19,360 సీట్ల కోసం ఫిబ్రవరి 20న నిర్వహించిన ఈ ప్రవేశపరీక్షకు 60,173 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శనివారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. మెరిట్‌ సాధించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 21 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.

వివరాల కోసం www.tswreis. ac.in, www.tswrjc.cgg.gov.in వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.