సారథి, రామడుగు: నాలుగో విడత హరితహారంపై మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కలిగేటి కవిత అధ్యక్షతన నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టారని అన్నారు. హరితహారాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. జడ్పీటీసీ సభ్యురాలు మారుకొండ లక్ష్మీ, ఏఎంసీ చైర్మన్ గంటల వెంకటరెడ్డి, ఎంపీడీవో ఎన్నర్ మల్హోత్ర, ఎంపీవో సతీష్ కుమార్, గుండి గోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శలు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
- June 29, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HARITHAHARAM
- KARIMNAGAR
- RAMADUGU
- కరీంనగర్
- రామడుగు
- హరితహారం
- Comments Off on చాలెంజ్‌గా హరితహారం