24 మందిపై కేసుల ఎత్తివేత
సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు రౌడీ షీటర్లకు గుడ్ చెప్పారు. సత్ర్పవర్తన కింద జిల్లాలో 24 మందిపై రౌడీషీట్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నాగర్‌కర్నూల్ డీఎస్పీ మోహన్‌కుమార్ సోమవారం ప్రకటనలో వెల్లడించారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ సబ్ డివిజన్ల పరిధిలో 69 మంది రౌడీషీటర్లను ముఖాముఖిగా పరిశీలించి కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ కె.మనోహర్ వారి సంబంధిత వివరాలను సేకరించారు. ప్రస్తుతం చేస్తున్న పనులు, జీవనోపాధి, సామాజిక వ్యవహారాలు, ప్రవర్తన వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇలా కొల్లాపూర్ సబ్ డివిజన్లో 12 మంది, నాగర్‌కర్నూల్ సబ్ డివిజన్ పరిధిలో 12 మందిపై సత్ర్పవర్తన కింద రౌడీషీట్ కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీ కె.మనోహర్ మాట్లాడుతూ.. పరివర్తన చెందారన్న ఉద్దేశంతో కేసులను ఎత్తివేశామని, మళ్లీ పాత ఘటనలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగతావారు కూడా సత్ర్పవర్తనను మెరుగుపర్చుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో సీఐ హనుమంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ సబ్డివిజన్లలో 24 మందిపై రౌడీషీట్లను ఎత్తివేయడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.