సారథి న్యూస్, రామాయంపేట/ పెద్దశంకరంపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్బీఆర్ అంబేద్కర్సతీమణి రమాబాయి అంబేద్కర్జయంతి వేడుకలను మెదక్జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో ఉపసర్పంచ్ కొమ్మట బాబు ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బెల్ల సిద్ధరాములు, గుడ్ల మల్లేశం, సందీప్, సురేష్, మహేష్, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. అలాగే పెద్దశంకరంపేట మండల కేంద్రంలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం హాజరయ్యారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగం రాయడానికి ఆయన సతీమణి చేసిన వెలకట్టలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో దళిత, కులసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగమేశ్వర్, జై భారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర కార్యదర్శి కాశపాగా ఇమ్మయ్య, ఉప్పరి దేవదాస్, గల్లా సంజీవ్, జిల్లా నాయకులు బస్వరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణ్, పవన్ దళిత సంఘాల నాయకులు పర్వయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.
- February 7, 2021
- Archive
- మెదక్
- షార్ట్ న్యూస్
- BR AMBEDKAR
- medak
- RAMABHAI
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్
- మెదక్
- రమాబాయి
- Comments Off on ఘనంగా రమాబాయి జయంతి