సారథి న్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గీత కార్మికుడి కుటుంబానికి సింగపూర్లో ఉంటున్న గౌడ కులస్తులు ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకెళ్తే.. మండలంలోని గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన ముంజ సాంబయ్యగౌడ్ (62) ఈనెల 23న కులవృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తాటివనానికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సింగపూర్ లో ఉంటున్న గౌడ కులస్తులు తెలుసుకుని బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తమ ఔదార్యం చాటుకున్నారు. సర్వాయి మిత్రా ఫౌండేషన్(సింగపూర్) వారు రూ.12,500, సింగపూర్ గౌడ్స్ రూ.3వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు కొండ వెంకటయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు సుద్దాల మల్లేశం గౌడ్, గౌడసంఘం సభ్యులు బుర్ర(దేవుని) వెంకన్న గౌడ్, గౌడసంఘం డైరెక్టర్లు కాసారపు బుచ్చిరాములుగౌడ్, ఏపూరి అంజయ్యగౌడ్, తిరుపతి, ముంజ లచ్చయ్య, పొన్నం వీరేశం, ముంజ శేఖర్ పాల్గొన్నారు.
- March 2, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- GOUDS CASTE
- KARIMNAGAR
- SINGAPORE
- కరీంనగర్
- గీత కార్మికుడు
- గౌడ కులస్తులు
- రామడుగు
- సింగపూర్
- Comments Off on గీత కార్మికుడి కుటుంబానికి సాయం