Breaking News

తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వాలి

తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వాలి
  • నీతిఆయోగ్‌ను కోరిన వినోద్‌ కుమార్‌

సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణకు రావాల్సిన నిధులను తక్షణం విడుదలచేయాలని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్​ రాజీవ్‌ కుమార్‌ను కలిసి మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు బి. వినోద్‌కుమార్‌,ఆర్థిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణరావుతో కలసి నీతి ఆయోగ్‌ చైర్మన్‌తో మాట్లాడారు. అనంతరం మీడియాతో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. భేటీలోని అంశాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో సెక్షన్‌ 94 ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తెలంగాణకు వనరులు ఇవ్వాలని పొందుపరిచారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రధాని, నాటి ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖలు రాశారని వినోద్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. ఇదే అంశాన్ని నీతి ఆయోగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలంగాణ రాష్ట్రానికి రూ.24వేల కోట్లు ఇవ్వాల్సిందిగా ఆర్థికశాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. కానీ నాటి నుంచి నేటివరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు.