సామాజిక సారథి , వనపర్తి : జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల కు ప్లాటు ఇవ్వడంలో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని తెలంగాణ జన సమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా ప్రభుత్వాన్ని ఖండించారు….. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల అందరికీ డబల్ బెడ్రూమ్ మరియు ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు… ఇప్పటివరకు పూర్తిస్థాయిగా జిల్లాల వారీగా ఉన్న జర్నలిస్టులను గుర్తించి అందరికీ ప్లాట్లు ఇస్తామని ఇండ్లు కూడా కట్టిస్తామని ముఖ్యమంత్రి గారు బహిరంగంగా సభలలో చెప్పడం జరిగింది. జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గత సంవత్సరం నుంచి జర్నలిస్టులందరికీ ప్లాట్లు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వనపర్తి జిల్లా కేంద్రంలో గురువారం రోజున జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ప్లాట్ల పట్టాలు మంత్రి గారు పంపిణీ చేశారు సగం మందికి మాత్రమే ప్లాట్లు ఇవ్వడం జరిగింది సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి వారికి పూర్తిగా ప్లాట్లు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం అని తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని అయినటువంటి సీనియర్ జర్నలిస్టులకు పూర్తిస్థాయిగా అన్యాయం చేయడం జరుగుతుందని జర్నలిస్టులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. కొంతమంది జర్నలిస్టులు మంత్రిగారి ని అడ్డుపెట్టుకొని ఏజెన్సీ రూపకంగా చలామణి అవుతూ… ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిట్టుగా రాస్తున్న పత్రిక జర్నలిస్టులకు ఫ్లాటు రాకుండా చేస్తున్న వారి పైన కూడా విచారణ చేయాలని అన్నారు… ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న జర్నలిస్టులతో కుమ్మక్కై వేరే వాళ్లకు ఇండ్లు ప్లాట్లు రాకుండా చేస్తున్నారని అన్నారు స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు తక్షణమే జర్నలిస్టులను గుర్తించి జర్నలిస్టులందరికీ పూర్తిస్థాయిగా ప్లాట్లు డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని మంత్రి గారికి కోరుతున్నాం…. అదేవిధంగా..అక్రిడేషన్ ఉన్న దాదాపు 70 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు అందలేదు మిగతా జిల్లాలలో దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒకరికి అక్కడ ఇచ్చారు మన వనపర్తి జిల్లాలో మాత్రం దరఖాస్తులు చేసుకున్న సగం మందికి కూడా అందలేదు….తెలంగాణ రాష్ట్రంలో .అక్రిడేషన్ జర్నలిస్టులందరికీ ప్లాట్లు ఇవ్వాలి…పనిచేస్తున్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు ప్లాట్లు ఇవ్వాలి..జర్నలిస్టుల అందరికీ దళిత బంధు ఇవ్వాలి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం…..జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ విద్య . వైద్యం అందించారుమంత్రిగారి ని తొందరగా జర్నలిస్టులందరికీ ఇండ్ల ప్లాట్లు అందజేయాలని కోరుతున్నాం.
- October 6, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on జిల్లా కేంద్రంలో జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయిగా ప్లాటు ఇండ్లు ఇవ్వాలి…యంఏ ఖాదర్ పాష