సారథి, రామడుగు: రామడుగు జడ్పీ హైస్కూల్ లో చదువుకున్న 1990-1991 పదవ క్లాస్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కరీంనగర్ లోని వీపార్క్ హోటల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత అందరూ ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో గోపాల్ రావుపేట ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవేల్లి నరేందర్ రెడ్డి, గోలిరామయ్యపల్లి ఉప సర్పంచ్ కనకయ్యతో పాటు 75 మందికి దాదాపుగా 60మంది హాజరయ్యారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు వెంకటరెడ్డి, ముకుందరెడ్డి, మనోహర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బ్రహ్మనందంను సన్మానించారు.
- April 5, 2021
- Archive
- KARIMNAGAR
- RAMADUGU
- అపూర్వ సమ్మేళనం
- కరీంనగర్
- రామడుగు
- Comments Off on అ‘పూర్వ’ సమ్మేళనం