సారథి, జూరాల(మానవపాడు): జూరాల ప్రాజెక్టు 47 గేట్లు ఎత్తి 4.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న రైతులను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు నదిలోకి చేపలవేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. జూరాల జలాశయానికి 4 లక్షల 65వేల 500 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.920 మీటర్ల మేర నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.585 టీఎంసీలు ఉంది. జూరాల నుంచి దిగువకు 47 గేట్లు ఎత్తి 4 లక్షల 62 వేల 576 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.