- రాత్రి 8గంటల కల్లా డ్యూటీ విరిమించేలా సజ్జనార్ఆదేశాలు
సామాజిక సారథి, హైదరాబాద్: మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరేలా డ్యూటీలు వేయాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె ముగిసిన తర్వాత 2019 డిసెంబర్1వ తేదీన అన్నిస్థాయిల ఉద్యోగులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో డ్యూటీ సమయాలు ఇబ్బందికరంగా ఉన్నాయని పలువురు మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేశారు. రాత్రి 8 గంటలకల్లా వారి విధులు ముగిసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో డ్యూటీ సమయాలను మారుస్తూ సమావేశం జరిగిన మూడో రోజులకే(డిసెంబర్4న) అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. కొద్దికాలం వాటిని అమలు చేసినా.. ఆ తర్వాత రద్దుచేశారు. రాత్రి 8 గంటల తర్వాత కూడా డ్యూటీ చేయాల్సి వస్తోందని ఇటీవల పలువురు మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేయడంతో ఎండీ సజ్జనార్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.