Breaking News

రైతు రాబందు వారోత్సవాలు

రైతు రాబందు వారోత్సవాలు

సామాజిక సారథి, జనగామ: ఎమ్మెల్యే నిర్వహిస్తున్న రైతు బంధు వారోత్సవాలు కాదు.. రైతు రాబందు వారోత్సవాలు అని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు.  సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు.  ప్రభుత్వ భూములు పేదల భూములను లాకున్న రైతు రాబందు ముత్తిరెడ్డి వారోత్సవాలు చేయడం అంటే  శవాన్ని ఇంట్లో పెట్టుకొని పండగ చేసుకునే విధంగా ఉంది అని విమర్శించారు. కనీసం ఈసారి యాసంగిలో వరి పంట వేయాల వద్దా అని వెంటనే ముత్తిరెడ్డి ప్రజలకు  చెప్పాలని హితవు పలికారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వల్ల  నియోజకవర్గ ప్రజలకు ఇది గత ఏడు సంవత్సరాలగా  రాక్షస పాలన అనుభవించిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నా  పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పటికైనా ఎమ్మెల్యే  ఇబ్బంది గురవుతున్న ప్రజలు సమస్యలను పట్టించుకోని ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని  కోరారు.