సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లా అదనపు ఎస్పీగా సృజన ఎస్పీగా పదోన్నతి పొంది బదిలీపై డీజీపీ కార్యాలయానికి వెళ్తున్న సందర్భంగా శుక్రవారం ఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాకు నూతనంగా అదనపు ఎస్పీగా బదిలీపై వచ్చిన నితిక పంత్ కు ఘన స్వాగతం పలికారు. పోలీస్ క్యలాణ మంటపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రమణకుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో నూతన అదనపు ఎస్పీ నితిక పంత్, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ డీఎస్పీలు బాలాజీ, భీమ్ రెడ్డి, శంకర్, సత్యనారాయణ రాజు, ఏవో అనిత, ఏఆర్ డీఎస్పీ జనార్ధన్, డీసీఆర్బీ ఇన్స్ పెక్టర్ రామకృష్ణా రెడ్డి, సంగారెడ్డి పట్టణ ఎస్ఐ రమేష్, సంగారెడ్డి రూరల్ ఎస్ఐ శివ లింగం అర్ఐ లు హరిలాల్, డానియల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- November 27, 2021
- Archive
- మెదక్
- Additional
- DGP
- SANGAREDDY
- SP
- అడిషనల్
- ఎస్పీ
- డీజీపీ
- సంగారెడ్డి
- Comments Off on అదనపు ఎస్పీ సృజనకు వీడ్కోలు