Breaking News

మేడారం ఏర్పాట్ల పరిశీలన

మేడారం ఏర్పాట్ల పరిశీలన

సామజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో జరగనున్న ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క, అధికారులు పరిశీలించారు. మంత్రి జంపన్న వాగులో మొక్కులు చెల్లించి, అనంతరం మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్నారు. వారి వెంట జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి, ఎంపీపీ గొంది వాణి శ్రీ, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, నాయకులు, అధికారులు ఉన్నారు.