సామాజికసారథి, హైదరాబాద్ : కొవిడ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ 60 ఏండ్ల పై బడిన వారందరూ తప్పనిసరిగా బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. పండుగల సందర్భంగా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్లో నూతన సీసీ రోడ్డు, కమ్యూనిటీ భవనం నిర్మాణాల పనులను కిషన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ పావని పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
- January 15, 2022
- Archive
- Top News
- జాతీయం
- లోకల్ న్యూస్
- Comments Off on అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి : మంత్రి కిషన్ రెడ్డి