సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్ మాజీనేత గట్టు రామచంద్రరావు షర్మిల పార్టీలోకి చేరనున్నారు. సోమవారం వైఎస్ షర్మిల సమక్షంలో రామచంద్రరావు పార్టీలో చేరుతారని చెబుతున్నారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదని ఇటీవల టీఆర్ఎస్‌కు రాజీనామా గట్టు రామచంద్రరావు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తారని రామచంద్రరావు ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో క్రియాశీలకంగా గట్టు పనిచేశారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరి కీలకనేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి సీఎం కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. ఇప్పుడు వైఎస్సార్టీపీలో చేరబోతున్నారు.
- January 3, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- Comments Off on వైఎస్సార్టీపీలోకి గట్టు