సారథి, కొల్లాపూర్: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారనున్నాయని నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతమ్మ, కలెక్టర్ ఎల్.శర్మన్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు, ముక్కిడిగుండం, పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటారు. మన ఇంటిని, వీధిని, ఊరును మనమే శుభ్రంగా ఉంచుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ఉద్దేశం అదేనని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
- July 5, 2021
- Archive
- Top News
- KOLLAPUR
- mla beeram
- PALLEPRAGATHI
- ఎమ్మెల్యే బీరం
- కొల్లాపూర్
- పల్లెప్రగతి
- Comments Off on పల్లెప్రగతితో గ్రామాలకు సొబగులు