సామాజిక సారథి, తలకొండపల్లి: రైతు సంఘం మండల నూతన కమిటీ ఎన్నికైనట్లు రంగారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అరిగోసపెట్టుతున్నాయని ఆరోపించారు. అధ్యక్షులుగా పిప్పల్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శివగల రమేష్, ఉపాధ్యక్షులుగా వెంకట్ రెడ్డి, కృష్ణయ్య సహాయ కార్యదర్శులుగా , మల్లేష్, జంగయ్య, పర్వతాలను ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు నరసింహ, ప్రజా సంఘాల నాయకులు దుబ్బ చెన్నయ్య, పెంటయ్య, సత్తయ్య, శీను తదితరులు పాల్గొన్నారు.
- October 28, 2022
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- Committee
- community
- ELECTION
- FARMER
- NEW
- Comments Off on రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక