Breaking News

అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖర్చులు ఖచ్చితంగా నమోదు చేయాలి

– పర్యవేక్షణలో ఎలాంటి లోపం లేకుండా చూడాలి

– సెంట్రల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ భేరా రామ్ చౌదరి

సామాజిక సారథి , నాగర్ కర్నూల్ :… నాగర్ కర్నూలు జిల్లాలో శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థుల ఖర్చుల వివరాలను నామినేషన్ వేసిన నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు ఖచ్చితంగా నమోదు చేయాలని భారత ఎన్నికల కమిషన్ నియమించిన జిల్లా వ్యయ పరిశీలకులు భేరా రామ చౌదరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ లతో కలిసి కేంద్ర ఎన్నికల వ్యయ పర్యవేక్షకులు భేరా రామ్ చౌదరి, శుక్రవారం ఐడిఓసి మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల పర్యవేక్షణ నోడల్ అధికారులు, నియోజకవర్గాల సహాయ వ్యయ పర్యవేక్షకులు, అకౌంటింగ్ టీంల సభ్యులతో సమావేశం నిర్వహించి వారి విధులపై సమీక్షించారు.ఈ సందర్భంగా సెంటర్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మాట్లాడుతూ……

ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేయలెన్స్ టీం, వీడియో సర్వేయలెన్స్ టీం, వీడియో పరిశీలన టీం, అకౌంటింగ్ టీమ్ ల సభ్యులు జిల్లాలో సమర్థవంతంగా తమ బాధ్యతలను నిర్వర్తించేలా చూడాలని నోడల్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట శాసన సభ నియోజకవర్గాకు జరగనున్న ఎన్నికలలో పోటీ చేయు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆమోద, ఆమోద యోగ్యం కాని ఖర్చుల వివరాలను సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ టీమ్, వి.ఎస్.టి., వి.వి.టి లు చేపట్టే నమోదు ప్రక్రియను చేయాలని అన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ద్వారా నిర్వహించు ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలు అన్నింటిని వీడియో సర్వేయలెన్స్ టీం సభ్యులు రికార్డింగ్ చేసి వీడియో పరిశీలన సభ్యుల ద్వారా సదరు వీడియో పరిశీలించి వివరాలను అకౌంటింగ్ టీం సభ్యులకు సమన్వయం చేసుకోవాలన్నారు. అకౌంటింగ్ టీం సభ్యులు వివరాలను షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. అనంతరం పూర్తి వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని అన్నారు. ర్యాలీ లు , సమావేశాలు ద్వారా నిర్వహించిన పార్టీ, ప్రచార ఖర్చులు నిర్ణయించిన రేట్ ల ప్రకారం నమోదు చేయాలని అన్నారు. పోటీ చేయుఅభ్యర్థులు తమ ప్రచార వ్యయ ఖర్చుల వ్యయ అకౌంట్ లు, రిజిష్టర్ లు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చులను నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికల సందర్భంగా, ఎన్నికల అనంతరం పరిశీలన చేయనున్నారని, పరిశీలనకు మధ్య మూడు రోజుల వ్యవధి ఉండాలని ఆయన స్పష్టం చేశారు .అనుమతి తీసుకున్న వాహనాలు కంటే ఎక్కువ ఉపయోగించిన ఖర్చులు నమోదు చేసి అనుమతి రద్దు చేయాలని అన్నారు. ఒకరు అనుమతి తీసుకున్న వాహనం వేరే అభ్యర్థి ఉపయోగించ రాదని, ఆ అభ్యర్థి వ్యయం లో ఖర్చు నమోదు చేసి అనుమతులు రద్దు చేయాలని అన్నారు.కరపత్రాలు, పోస్టర్ లు, ఫ్లెక్స్ లు ముద్రించినపడు ప్రింటర్ మరియు ప్రచురణకర్తలు ఎన్నికల ప్రజా ప్రాతినిధ్య చట్టం1951 ప్రకారం నిబంధనలు పాటించాలని అన్నారు.ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎన్నికల లో ప్రకటనలు జిల్లా మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్కమిటీ సర్టిఫికేషన్ చేయనున్నట్లు, ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రకటనలు ఎన్నికల సంఘం విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయం నమోదు చేయడం జరగాలి అన్నారు.ఓటర్లను ప్రలోభ పరిచేలా డబ్బు,మద్యం పంపిణీ పై ప్లయింగ్ స్క్వాడ్ లు, ఎస్.ఎస్.టి లు తనిఖీ లు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.అదే విధంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉచితంగా అంద చేసే కానుకలు అనగాచీరలు, కుట్టు మిషన్ లు, స్పోర్ట్స్ కిట్ లు, గడియారం లు, బొమ్మలు, టార్చి లైట్ లు, గొడుగు లు, ఆభరణాలు, సైకిల్స్, కాస్మెటిక్స్, స్కూల్ బ్యాగ్ లు, సెల్ ఫోన్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టే షర్ట్ లు, మిక్సీ గ్రైండర్ లు వంటివి పంపిణీ చేయకుండా కట్టు దిట్ట మైన చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లా వ్యయ పరిశీలన కమిటీ నోడల్ అధికారి జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ బాబు, సహాయ వ్యయ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, సహాయ వ్యయ పరిశీలన అధికారులు రిటర్నింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.అనుమానాస్పద బ్యాంక్ లావా దేవీ లు,10 లక్షల కంటే మించి నగదు జమ ,ఉపసంహరణ, ఆన్లైన్ ద్వారా మల్టిపుల్ లావా దేవీ లపై పర్యవేక్షణ చేయాలని అన్నారు.ఐన్ కం టాక్స్, వాణిజ్య పన్నుల శాఖ, వ్యయ పరిశీలన శాఖలు ఎన్నికల వ్యయం నమోదు లో సమన్వయము తో పని చేయాలని అన్నారు.ఎం సి ఎం సి కమిటీ ద్వారా రోజువారి దిన పత్రికల్లో వచ్చే ఫెడ్ న్యూస్ పై దృష్టి సారించాలన్నారు.సోషల్ మీడియా పై పటిష్టంగా ఉంచాలన్నారు.సమావేశంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ…..

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో 10 చెక్పోస్టుల ద్వారా పటిష్టన్నిగా ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లావ్యాప్తంగా ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, నియోజకవర్గానికి నాలుగు చొప్పున నియమించి తనిఖీలు ముమ్మరం చేయడం జరిగిందన్నారు.ప్రతి చెక్పోస్టు వద్ద నిర్వహించే తనిఖీలను కలెక్టరేట్ నుండి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసే అంశాలపై పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీలు సెంట్రల్ అబ్జర్వర్ను స్వాగతం పలికి మొక్కను బహుకరించారు.అనంతరం జిల్లా ఎన్నికలపై ఎస్పీ కలెక్టర్లతో ఆయన వివిధ అంశాలపై చర్చించారు.ఈ సమావేశం లో జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారి శ్రీనివాస్ బాబు, ఎన్నికల జిల్లా పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారులు నర్సింగ్ రావు, రమాదేవి, ఏపీఆర్ఓ తిరుపతయ్య నాగర్ కర్నూల్ కొల్లాపూర్ అచ్చంపేట నియోజకవర్గల సహాయ వ్యయ పర్యవేక్షకులు, అకౌంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.