Breaking News

‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో జగిత్యాల ప్రధాన రహదారిపై హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీఆర్డీవో లంకల శ్రీలతరెడ్డి తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.