సారథి, సిద్దిపేట: అధైర్యపడొద్దు అండగా ఉంటామని బుధవారం బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు, హుస్నాబాద్ టౌన్ ఇంచార్జి నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో కరోనా బారినపడి హోం ఐసోలేషన్ లో చికిత్స పోందుతున్న పలువురి కుటుంబాల్లో మనోధైర్యం నింపి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామంలోని 8వ వార్డు సభ్యులు సిరికొండ జగదీశ్వర్ చారి ఆధ్వర్యంలో కొవిడ్ బాధితులకు కొడిగడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండలాధ్యక్షులు గొళ్లపల్లి వీరాచారి, హుస్నాబాద్ టౌన్ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, ఓబీసీ మోర్చా హుస్నాబాద్ పట్టణాధ్యక్షులు పోలోజు రాజేందర్ చారి, మండల ఉపాధ్యక్షులు మౌటే అయిలయ్య, తదితరులు పాల్గొన్నారు.
- June 3, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AKKANNAPET
- BJP
- DISTRIBUTION
- FRUITS
- LEADERS
- అక్కన్నపేట్
- పంపిణీ
- ఫ్రూట్స్
- బీజేపీ
- లిడర్స్
- Comments Off on అధైర్యపడొద్దు..