సామాజిక సారథి,రామడుగు: మండలంలోని వెదిరలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో భాగంగా కమిటీ సభ్యులు గోదావరిఖని వన్ టౌన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గంగాధర రమేష్ ను కలిసి విరాళం అందించాల్సిందిగా గ్రామస్థులు కోరారు. సిఐ రమేష్ తన సొంత ఊరి కోసం లక్ష రూపాయల చెక్కును శుక్రవారం అందించారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహ కమిటీ చైర్మన్ నాగుల రాజశేఖర్, వైస్ చైర్మన్ అంజన్ కుమార్, కమిటీ సలహాదారుడు వెన్నం రాజమల్లయ్య, వెదిర అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కుమ్మరి రాము, కమిటీ సభ్యులు శనిగరపు భూమయ్య, కంకణాల మోహన్, కాపెళ్లి రాజు, రంగు శంకర్ తదితరులు ఉన్నారు.
- November 27, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- అంబేద్కర్
- కరీంనగర్
- రామడుగు
- విగ్రహం
- వెదిర
- సీఐ
- Comments Off on అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి విరాళం