సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీకి ఉంటే కరోనా విషయంలో ఈ పరిస్థితి ఉండేదా? అని కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు ప్రశ్నించారు. మంగళవారం రామడుగు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మాట కూడా ఎత్తకపోవడం జిల్లా ప్రజలను మోసం చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా ఎమ్మెల్యేలు కనీసం జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా కనీసం నోరు మెదపకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్ కాలేజీ ఉన్నట్లయితే కరోనా రోగులకు కొంతవరకైనా ఉపయోగం ఉండేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు పేదలను దోచుకుంటున్నాయని అన్నారు. కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు మెడికల్ కాలేజీ సాధనకు ప్రయత్నించాలని హితవు పలికారు.
- May 18, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CONGRESS
- MEDICAL COLLEGE
- RAMADUGU
- కరీంనగర్
- కాంగ్రెస్
- మెడికల్ కాలేజీ
- రామడుగు
- Comments Off on మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?