- మంత్రి కేటీఆర్‌పై షర్మిల ట్వీట్ సెటైర్లు
సామాజికసారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ట్విట్టర్ వేదిక దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌పై షర్మిల సెటైర్లు విసిరారు. ‘తెలియనిది అడిగితే పాపం మంత్రి కేటీఆర్ ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది. మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? … ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా?… జనాలను డ్రగ్స్‌కు బానిస చేయడం ఎలా?… రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా?… నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేయడం ఎలా?… దళితులను మోసం చేయడం ఎలా?.. వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా?… ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టడం ఎలా?.. ఉద్యమకారులను తొక్కేయడం ఎలా?… ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా… పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా? వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు?‘ అంటూ వైఎస్షర్మిల ట్వీట్ చేశారు.