… మార్కొండయ రిజర్వాయర్ పనులను నిలిపివేసిన రైతులు
సామాజిక సారధి , బిజినేపల్లి :మార్కొండయ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేయాలంటూ గంగారం గ్రామానికి చెందిన రైతులు పనులను నిలిపివేశారు . సోమవారం రిజర్వాయర్ కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులు పనులు జరుగుతున్న సంఘటన స్థలానికి చేరుకొని తమ పొలాలలో పనులు చేయాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేయాలని అప్పటివరకు పనులు నింపాలని వాహనాలకు అడ్డం తగిలి ఆందోళన చేశారు . పరిహారం కొరకు భూనిర్వశితులు పలుమార్లు అధికారులకు తెలిపిన కంపెనీ నిర్వాహకులు పట్టించుకోకుండా యదేచ్చగా పనులు కొనసాగిస్తున్నారని ఇలాంటి చర్యలు చేయడం మంచి పద్ధతి కాదని పలువురు రైతులు కంపెనీ నిర్వాహకులకు హెచ్చరికలు చేశారు .
- April 10, 2023
- Archive
- Top News
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on పరిహారం ఇచ్చాకే పనులు చేయండి