Breaking News

కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు నిద్రపోను నిద్రపోనివ్వను

కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు నిద్రపోను నిద్రపోనివ్వను
  • తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే ..కోచ్ ఫ్యాక్టరీ సాధించేది కాంగ్రెస్సే
  • జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి

సామాజిక సారథి, కాజీపేట/హన్మకొండ: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ  సాధన కోసం నిర్వహించిన 30 గంటల నిరాహార దీక్షలో అధికార పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు పాల్గొని మద్దతు ఇవ్వడం సిగ్గుచేటుగా ఉందని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ దీక్షలో పాల్గొని మాట్లాడారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు పార్లమెంట్ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి కోచ్ ఫ్యాక్టరీ సాధించాకే పార్లమెంట్ లో  అడుగు పెట్టాలని, లేదంటే తదనంతరం జరిగే పరిణామాలకు అధికార పార్టీ నాయకులే కారణమని దుయ్యబట్టారు.తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యం లో 30 గంటల పాటు నిర్వహించిన మహా నిరాహారదీక్షకు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ముఖ్యతిధిగా హాజరై మద్దుతుగా మహా నిరహారదీక్షలో పాల్గొని మాట్లాడారు. కాజీపేట జంక్షన్ ను రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, కాజీపేట వ్యాగెన్ రిపేర్ వర్క్ షాప్ ( పీఓహెచ్) షెడ్కు శీతాకాల పార్లమెంటరీ సమావేశాలలో పూర్తి స్థాయి నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మహా నిరాహార దీక్షలో రైల్వే కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కుల సంఘాలు, చిరు వ్యాపారులు,  సకల జనులు పాల్గొన్నారు.