Breaking News

పంటను దళారులకు అమ్ముకోవద్దు

పంటను దళారులకు అమ్ముకోవద్దు

సారథి, రామాయంపేట: రైతులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి ధాన్యాన్ని అమ్ముకోవాలని మెదక్​జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. మంగళవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో గల సబ్ మార్కెట్ యార్డులోని వరి కొనుగోలు సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు పంటను దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకుని, మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయన వెంట కార్యక్రమంలో ఏఈ వోలు దివ్య శ్రీ, గణేష్, సహకార సెంటర్​ ఇన్​ చార్జ్​ మహిపాల్, రమేష్ పాల్గొన్నారు.