సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంలో సీపీఐ ముఖ్యకార్యకర్తల సమావేశం గొడిశాల తిరుపతిగౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల వేలం కోసం తెచ్చిన జీవోనం.13ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని, పేదలు, దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాలకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయాలన్నారు. ధరణి వెబ్ సైట్ లో తప్పులను సరిదిద్దాలని కోరారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, ఎగుర్ల మల్లేశం, వేముల మల్లేశ్, కనుకయ్య, క్రాంతికుమార్, రాజేశం, ఐలయ్య పాల్గొన్నారు.
- July 9, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CPI
- DHARANI
- RAMADUGU
- జీవోనం.13
- రామడుగు
- సీపీఐ
- Comments Off on ప్రభుత్వ భూములను వేలం వేయొద్దు