సామాజిక సారథి, నాగర్ కర్నూల్: అంగన్వాడి టీచర్ల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, ఆ ఆలోచనను విరమించుకుని నెలకు రూ.26 వేల వేతనం అమలు చేయాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రామయ్య, ప్రధాన కార్యదర్శి పర్వతాలు, నాయకులు అశోక్, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.గీత, అంగన్వాడీ వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు మాసమ్మ, నాయకురాలు రజియా, వెంకటమ్మ, అంజనమ్మ, కృష్ణవేణి, భాగ్యమ్మ, అలివేల, చంద్రకళ, విజయలక్ష్మి, సుచిత్ర, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
- December 28, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- అంగన్వాడీ
- కర్నూల్
- టీచర్లు
- తొలగించద్దు
- నాగర్
- నిరసన
- Comments Off on అంగన్వాడీ టీచర్లను తొలగించద్దు