- కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్‌చేసిన పోలీసులు
- వనపర్తిలో సీఎం పర్యటన నేపథ్యంలో చర్యలు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వనపర్తిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తారనే కారణంతో పోలీసులు కాంగ్రెస్, బీజేపీ నేతలను మంగళవారం ముందస్తుగా అరెస్ట్‌చేశారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో కూడా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తెల్కపల్లికి చెందిన యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వారణాసి శ్రీనివాస్ స్నానం చేసేందుకు వెళ్తుండగా బాత్రూం వద్ద నుంచే బట్టలు లేకుండా అరెస్ట్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో మరో మరో 10మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కనీస మర్యాద ఇవ్వకుండా ఇళ్లలోకి వచ్చి తమను తీసుకెళ్లడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కూర్చుని అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. పోలీసుల ముందస్తు అరెస్ట్‌ల పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు.