Breaking News

‘పరిహారం ఇవ్వకుండా.. పైప్​లైన్​ వేయొద్దు’

‘పరిహారం ఇవ్వకుండా..పైప్​లైన్​వేయొద్దు’

సారథి న్యూస్, మానవపాడు: పరిహారం ఇవ్వకుండా తమ పొలాల గుండా హెచ్​పీసీఎల్​ గ్యాస్ ​పైప్​లైన్​వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. తగిన పంట నష్టపరిహారం ఇవ్వకుండా కోర్టు నోటీసులు పంపించి దౌర్జన్యంగా పైప్​లైన్​ వేయడం ఏమిటని ప్రశ్నించారు. మిరప పంట, పత్తి పనులు పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.