సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాల కృష్ణానది తీర ప్రాంతాలను సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై బాలవెంకటరమణ, సిబ్బందితో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. సోమశిల కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు. నది ప్రవాహం ఉధృతంగా ఉన్నందున బోటింగ్ చేయడం, చేపలవేటకు వెళ్లడం, పర్యాటకులు నది నీటిలోకి దిగడం వంటి పనులు చేయకూడదని సూచించారు. ఈ సూచనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరబోటు యజమానులకు, మత్య్సకారులకు ఆదేశాలు జారీచేశారు. జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉధృతంగా రావడంతో కృష్ణానది తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పర్యాటకులు నీటిలో దిగకుండా ఉండాలని, మొసళ్లు ఉంటాయని సీఐ వెంకట్ రెడ్డి సూచించారు.
- July 27, 2021
- Archive
- Top News
- KOLLAPUR
- KRISHNA RIVER
- NAGARKURNOOL
- కృష్ణానది
- కొల్లాపూర్
- నాగర్కర్నూల్
- Comments Off on ఈ టైంలో కృష్ణానదిలోకి వెళ్లొద్దు.. ఎందుకంటే?