- న్యూ ఇయర్వేడుకలపై ఆంక్షలు
- కరోనా నేపథ్యంలో కఠిన నిబంధనలు
- డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు
సామాజికసారథి, హైదరాబాద్: న్యూ ఇయర్ నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2వ తేదీ వరకు నిషేధిస్తూ రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్న ఆయన.. కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించేలా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు స్పష్టంచేశారు. ఇక, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని సూచించారు. కొవిడ్ నిబంధనల్లో ఆరోగ్యశాఖ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో పబ్స్, హోటళ్లు, క్లబ్‌లకు న్యూఇయర్ గైడ్ లైన్స్ పాటించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో న్యూఇయర్ ఆంక్షలు అమలు అవుతాయని పేర్కొన్నారు. కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించేలా ఈ ఆదేశాలను అమలు చేయాలని పోలీసులుకు సూచించారు. న్యూఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండటం.. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్ పోర్ట్‌లో కూడా టెస్టులు చేసి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశాం. ఎక్కడైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నామని అన్నారు. విధుల్లో ఉన్న పోలీసులు మాస్క్‌లు ధరించి డ్యూటీ చేయాలని స్పష్టంచేశారు. ఇక, పబ్బులు, ఈవెంట్స్ పై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనల్లో ఆరోగ్యశాఖ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని డీజీపీ చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో కరోనా టెస్టులు చేసి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశామని, ఎక్కడైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. విధుల్లో ఉన్న పోలీసులు మాస్కులు ధరించి డ్యూటీ చేయాలని తెలిపారు. పబ్బులు, ఈవెంట్లపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాలని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.