Breaking News

సర్పంచ్ అక్రమాలపై జిల్లా అధికారుల విచారణ

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయన్ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అవంతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్, డీఎల్పీవో రామ్మోహన్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఎమ్మెల్సీ నిధుల నుంచి చేపట్టిన వీధిరైట్లు, ఇతర అభివృద్ధి పనులకు గ్రామపంచాయతీ నిధులు డ్రా చేశారని జిల్లా అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ట్రాక్టర్ ను సొంత పనులతో పాటు ఇష్టానుసారం వాడుతున్నారని ఉపసర్పంచ్ బి.కుర్మయ్య, వార్డు సభ్యులు అధికారుల దృష్టికి తెచ్చారు. సర్పంచ్ అక్రమాలకు పంచాయతీ సెక్రటరీ అనంతరావు కూడా వంతపాడుతున్నారని ఆరోపించారు. గతంలో ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని అధికారులకు వివరించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి అక్రమాలు తేలితే చర్యలు తీసుకుంటామని డీపీవో, డీఎల్ పీవో హెచ్చరించారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించారు.


శాయన్ పల్లిలో విచారణ జరుపుతున్న జిల్లా అధికారులు