సారథి, రామడుగు: మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా మంగళవారం స్థానిక ఆ పార్టీ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్య సెల్ మండలాధ్యక్షుడు బొజ్జ తిరుపతి స్వీట్లు పంచిపెట్టారు. ఈటల రాజేందర్ రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎడవెల్లి రామ్, మండల ఉపాధ్యక్షుడు ఎడవెల్లి లక్ష్మణ్, కట్ట రవీందర్, అజయ్, జయంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
- June 15, 2021
- Top News
- BJP
- ETALA RAJENDAR
- RAMADUGU
- ఈటల రాజేందర్
- బీజేపీ
- రామడుగు
- Comments Off on ఈటల చేరిక వేళ స్వీట్ల పంపిణీ