సారథి, రామడుగు: కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేసింది. ఈ సమయంలో బడుగు జీవులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు ఎందరో మహానుభావులు. ఆదరణ సేవాసమితి, సర్వ్ టూ సొసైటీ సంయుక్తంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. వారి చదువు పూర్తయినందున ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొక్కెరకుంట గ్రామంలో ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేసి ఉదారత చాటుకున్నారు. కార్యక్రమంలో ఆదరణ సేవాసమితి అధ్యక్షురాలు పావని మాట్లాడుతూ.. సంకల్పబలం గట్టిదైతే దేవుడి ఆశీస్సులతో తోటి వారి ప్రోద్బలం కూడా తోడవుతుందన్నారు. సర్వ్ టూ సొసైటీ అధ్యక్షుడు శశాంక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
- June 13, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- COVID19
- KARIMNAGAR
- RAMADUGU
- కరీంనగర్
- కరోనా
- కొవిడ్ 19
- రామడుగు
- Comments Off on పేదలకు సరుకులు పంపిణీ