సారథి, బిజినేపల్లి: వాతావరణ మార్పులకు అనుసంధానంగా స్థిరస్థాపక కుటుంబాల అభివృద్ధి(ఆర్ఏహెచ్యాక్ట్) అనే పథకం ద్వారా నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్, లట్టుపల్లి, సల్కర్ పేట, వసంతపూర్, వట్టెం గ్రామాలకు చెందిన 231 మంది రైతులకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు పంపిణీ చేశారు. వర్షాధారంగా రైతులకు ఎకరానికి సరిపడా ఒక పత్తి ప్యాకెట్ రెండు కేజీల కంది విత్తనాలు (4:1) నిష్పత్తిలో అంతరపంటగా వేసేందుకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మహేశ్వర్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకుడు రమేష్ బాబు, వ్యవసాయ విస్తరణాధికారులు అఖిల్ కుమార్, విష్ణువర్ధన్, కిషోర్, వట్టెం సర్పంచ్ అమృత్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు తిరుపతిరెడ్డి, సల్కర్ పేట కోఆర్డినేటర్ రాములు, వడ్డెమాన్ ఎంపీటీసీ సభ్యుడు ఊశన్న, గ్రామరైతులు పాల్గొన్నారు.
- July 14, 2021
- Archive
- పొలిటికల్
- మహబూబ్నగర్
- షార్ట్ న్యూస్
- BIJINEPALLY
- NAGARKURNOOL
- RAH ACT
- ఆర్ఏహెచ్యాక్ట్
- బిజినేపల్లి
- రైతు సమన్వయ సమితి
- Comments Off on రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ