Breaking News

జేపీ.. గొప్పగుణం

జేపీ.. గొప్ప గుణం

తండ్రి జ్ఞాపకార్థం బెంచీల వితరణ

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండల మాజీఎంపీపీ పకాడి జయప్రకాశ్ (జేపీ)​ మరోసారి తన గొప్ప సేవాగుణాన్ని చాటుకున్నారు. ప్రయాణికులు, సామాన్యులు, సందర్శకుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి తహసీల్దార్ ఆఫీసు, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, సీఐ కార్యాలయం ఆవరణలో సిమెంట్ ​బెంచీలను ఏర్పాటుచేశారు. కాగా, మండలంలోని బొల్లంపల్లి పంచాయతీ చల్లపల్లి గ్రామానికి చెందిన దివంగత మాజీ సర్పంచ్ పకాడి రత్నయ్య ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. అప్పట్లో పేదలకు ప్రభుత్వం నుంచి ఇళ్లు మంజూరు చేయించడంతో పాటు భూములు ఇప్పించారు. స్కూళ్లు కట్టించడంతో పాటు రాత్రిపూట బడుల నిర్వహణ, గ్రామాలకు తాగునీరు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర విషయాల్లో ఆయనకు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని జయప్రకాశ్ (జేపీ)​రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. తన తండ్రి స్మారకార్థం ప్రజాసేవకు అంకితమయ్యారు. ఆయన కూడా బొల్లంపల్లి సర్పంచ్​గా సేవలు అందించారు. అలాగే వెల్దండ ఎంపీపీగా పనిచేశారు. సందర్శకులు, ప్రయాణికుల కోసం వెల్దండ పోలీస్ స్టేషన్, గుండాల రామలింగేశ్వర ఆలయం, ఏకలవ్య గురుకుల పాఠశాల, బొల్లంపల్లి, చల్లపల్లి, ఇదమ్మబండతండా, అంకమోనికుంట గ్రామాల్లో కూర్చునేందుకు బెంచీలను ఏర్పాటుచేశారు. జేపీ చేసిన కృషికి అక్కడికి వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. మాజీ ఎంపీపీ జయప్రకాశ్​ను తహసీల్దార్​ చంద్రశేఖర్, పలువురు నాయకులు అభినందించారు.